Tuesday, February 8, 2011

have a look at social service


“నిశబ్ద  ఫలం  ప్రార్ధన
ప్రార్ధన  ఫలం  విశ్వాసం
విశ్వాస  ఫలం  ప్రేమ
ప్రేమ  ఫలం  సేవ
సేవ  ఫలం  శాంతి”
మౌనానికి  చాలా శక్తి  ఉంది.మౌనంలో  మనం  లోతుగా  ఆలోచిస్తాం .మౌనంగా  ఉన్నప్పుడే మనలో  సృజన  పొంగుకొస్తుంది .దానికి  సేవ  తోడైతే  బంగారానికి  పరిమళం  అద్దినట్టే .సేవా  గుణం  లేకపోతే  ఏదో  ఒక  దశలో  మనం  నిస్పృహకు  లోనవుతాం. సేవతో  మనలోని  ప్రేమ  గుణం  పెల్లుబుకుతుంది .అందరు  ఆత్మీయులే  అనిపిస్తారు . శత్రువులే  కనిపించరు .
"
ప్రతి  ఒక్కరు  మరణించి  తీరాల్సిందేనన్న కఠోర  వాస్తవాన్ని  గుర్తించలేని  వారు  మాత్రమే  తోటి  వారి  పట్ల  క్రూరంగా ప్రవర్తిస్తారు"
"
ఇతరులతో  సత్సంబంధాలు  నెలకొల్పుకోవడానికి  తగిన  ప్రయత్నాలు  చేయకుండా  తమ  చుట్టూ  అడ్డు  గోడలు  నిర్మించుకున్న  వారికి ఎవరు  సన్నిహితులు  కాలేరు"
  అడ్డు  గోడల్ని  చేదించి  మనలోని  సేవా గుణాన్ని  సేవాతత్పరతను వెలికి  తీసి  సామాజిక  సేవకి ,సమాజ  అభ్యున్నతికి  కృషి  చేసిన  నాడు  మన  దేశం  సస్య  శ్యామలం  అవుతుంది .మనం  మానవులుగా  జన్మించినందుకు  మన  జీవితంలో  కనీసం  పది  మందికైన సహాయం  చేస్తే వచ్చే ఆనందం  కోటి  రూపాయలు  ఇచ్చినా  దొరకదని  నా అభిప్రాయం.

No comments:

Post a Comment